WGL: పర్వతగిరి మండలంలో రేషన్ కార్డులపై కాంగ్రెస్ నాయకుల ఫోటోలు ఉండడంపై బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఆదివారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఫోటో లేకుండా అనధికార వ్యక్తుల చిత్రాలు ముద్రించడం విచిత్రమన్నారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.