VSP: అక్కయ్య పాలెంలోని నందగిరినగర్లో ఆదివారం ఉదయం ఫోర్త్ టౌన్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సీఐ ఉమాకాంత్ ఆధ్వర్యంలో ఎస్సైలు తమ సిబ్బందితో సోదాలు చేశారు. రికార్డ్స్ లేని పది బైకులు, సైలెన్సర్లు బిగించని రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల ఆధార్ కార్డులు పరిశీలించారు. స్థానికులకు భద్రతపై అవగాహన కల్పిస్తూ సూచనలు ఇచ్చారు.