ఏలూరు ఆర్టీసీ డీజిల్ బంకులో జరిగిన రూ.82 లక్షల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా అవినీతిపై కథనాలు వస్తున్నా యాజమాన్యం పోలీసు దర్యాప్తు కోరకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తక్షణమే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి, నిజానిజాలు నిగ్గు తేల్చాలన్నారు.