W.G: ఉండి రాజుల పేటలో ఆవాస్ సర్వేలో భాగంగా గృహ నిర్మాణాలకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కొరకు గృహనిర్మాణ శాఖ చేస్తున్న సర్వేను కలెక్టర్ నాగరాణి ఆదివారం తనిఖీ చేశారు. యాప్ ఎలా పనిచేస్తుంది, ఇప్పటివరకు యాప్ ద్వారా ఎన్ని ఆన్లైన్ చేశారు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె లబ్ధిదారులకు ఆన్లైన్ చేస్తున్న వివరాలను స్వయంగా పరిశీలించారు.