కృష్ణా: పమిడిముక్కల గ్రామంలో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు.పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ₹1,870/- నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.