విశ్వ ఆవిర్భావం(బిగ్ బ్యాంగ్) తర్వాత ఏర్పడిన అత్యంత పురాతన నక్షత్రాలను (POP III) నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) గుర్తించినట్లు తెలుస్తోంది. భూమికి 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న LAP1-B గెలాక్సీలో వీటి ఆధారాలు లభించాయి. సూర్యుని ద్రవ్యరాశి కంటే 100 రెట్లు తీవ్రమైన అతినీలలోహిత(UV) కాంతిని విడుదల చేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది.