ప్రైవేట్ కంపెనీలకు షాక్ ఇస్తూ BSNL కస్టమర్ల కోసం రూ.485 విలువైన అద్భుతమైన ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ 72 రోజుల పాటు నాన్‌స్టాప్ కనెక్టివిటీని అందిస్తుంది. అపరిమిత కాలింగ్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, 100 SMSలు లభిస్తాయి. ఇంత తక్కువ ధరలో ఎక్కువ డేటా, ఎక్కువ చెల్లుబాటును అందించే చౌకైన ప్లాన్‌ను ఏ ప్రైవేట్ టెలికాం కంపెనీలు అందించట్లేదని BSNL పేర్కొంది.