కోలీవుడ్ హీరో ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మృణాల్ నటించిన ‘దో దివానే షెహర్ మే’ సినిమా టీజర్‌ను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. ‘చాలా బాగుంది’ అని ధనుష్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌కు లవ్ సింబల్‌తో మృణాల్ రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ నెట్టింట రచ్చ జరుగుతుంది.