VZM: కొమరాడ మండలం జంఝావతి రబ్బర్ డ్యాం వద్ద ఆదివారం ముగ్గురి వ్యక్తులు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో ప్రతాప్, గోవింద నాయుడు మృతదేహాలు గుంప సోమేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఇవాళ ఉదయం నీటిలో కనిపించడంతో స్థానికులు చూసి కొమరాడ పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.