సత్యసాయి: APSSDC ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‌మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరికృష్ణ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సురేష్‌బాబు కోరారు. ఈ నెల 26న ధర్మవరం పాలిటెక్నిక్ కళాశాలలో మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, 10వ తరగతి నుంచి పీజీ పూర్తిచేసిన వారు అర్హులని తెలిపారు.