తూ.గో: దేవరపల్లి మండలం దుద్దుకూరు టీడీపీ సీనియర్ నాయకులు మొహమ్మద్ అహ్మద్ ఆలీ అనారోగ్యంతో సోమవారం ఉదయం మరణించారు. ఈయన పార్టీలో టీడీపీ మైనారిటీ నేతగా అనేక పదవులు పొంది గ్రామానికి సేవలు అందించారు. ఈయన అకాలమరణానికి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంచితనం, నిబద్ధత కలిగిన వ్యక్తిని కోల్పోయామని గ్రామస్తులు, నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.