KDP: కడప ఎస్టీయూ భవనంలో అభ్యుదయ వేదిక, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు అధ్యక్షతన ఆదివారం భారత రాజ్యాంగం- ప్రజాస్వామ్యం- ప్రాథమిక హక్కులు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగంపై దాడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రపంచంలో ఉత్తమమని, పవిత్ర గ్రంథం అని పేర్కొన్నారు.