ELR: ఉమ్మడి జిల్లాలో తాత్కాలిక పద్ధతిపై స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా జడ్జి శ్రీదేవి ఆదివారం తెలిపారు. మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 12లోగా ఏలూరులోని జిల్లా కార్యాలయానికి దరఖాస్తులను అందజేయాలి. ఎంపికైన వారికి నెలకు రూ.45,000 వేతనం చెల్లిస్తారని అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.