SKLM: జిల్లా ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామానికి చెందిన ఫార్మసిస్ట్ పప్పల వేణుమాధవ్ డిసెంబర్ నెలలో జరగబోయే ఏపీ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ పోటీలలో పోటీ చేయనున్నట్లు ఇవాళ తెలిపారు. మొత్తం 42 మంది ఫార్మసిస్టులు బరిలో ఉండగా జిల్లా నుంచి ఏకైక వ్యక్తి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మసిస్టుల సమస్యలపై దృష్టి సారిస్తానన్నారు. ఏ సమస్య వచ్చిన తెలియజేయాలన్నారు.