KRNL: ATM డిపాజిట్ మిషన్లు(CDM), UPI ఉపయోగించి మోసగాళ్లు అక్రమ లావాదేవీలు జరిపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ‘తెలియని వ్యక్తుల కోసం ATM CDMలో డబ్బు జమ చేయండి, PhonePe/UPI ద్వారా పంపండి, కమిషన్ ఇస్తాం’ అంటూ ప్రజలను మోసం చేస్తున్నట్లు చెప్పారు. ఇవి మనీ లాండరింగ్ & సైబర్ నేరాల కిందికి వస్తాయన్నారు.