MDK: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. ఇప్పటివరకు 49,027 మంది రైతుల నుంచి 2,00,334 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ. 323.04 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. అలాగే, 5,008 మంది సన్నధాన్యం రైతులకు రూ. 11.56 కోట్ల బోనస్ చెల్లింపులు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.