ప్రకాశం: ఒంగోలులో సోమవారం సాయంత్రం ట్రాఫిక్ సీఐ జగదీశ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 12 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పోలీసులు గుర్తించారు. వీరిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, 11 మంది వాహనదారులకు ఒక్కొక్కరికి పదివేలచొప్పున జరిమానా, మరొకరికి 2 రోజుల జైలు శిక్షను న్యాయమూర్తి విధించారు.