ELR: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏలూరు MP పుట్టా మహేష్ కుమార్ అన్నారు. అన్నదాతల్లో అవగాహన కోసం ‘రైతన్నా మీకోసం’ పేరుతో సోమవారం నుంచి డిసెంబర్ 2 వరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందన్నారు. రాష్ట్రంలో పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.