AP: అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు అవాస్తవమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ స్పష్టం చేశారు. రాయచోటి నుంచి మార్చడం లేదన్నారు. తన మంత్రి పదవి కాపాడుకునేందుకు ఒప్పుకున్నట్లు కొందరు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంగా రాయచోటి లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తేల్చి చెప్పారు.