కృష్ణా: జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య కొత్త వివాదానికి తెరలేపింది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల విలీనం విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదు. విజయవాడకు ఆనుకుని ఉన్న ఈ రెండు నియోజకవర్గాలను NTR జిల్లాలో విలీనం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంలో గన్నవరం MLA యార్లగడ్డ పట్టుబట్టి కూర్చున్నారు. అలా చేస్తే జిల్లా విస్తీర్ణం తగ్గి ప్రాధాన్యత కూడా తగ్గిపోతుందని ఎమ్మెల్యేలు అంటున్నారు.