NZB: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, అన్ని రంగాల్లో వారు పురోగతి సాధిస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్ మండలం పాల్ద గ్రామంలో 24, మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో 39 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.