కోనసీమ: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనకు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. రాజోలు, మలికిపురం మండలాల్లో ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. భద్రత విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని, విధులలో అలసత్వం వహించరాదని అధికారులకు సూచించారు.