నల్గొండ మండలం అక్కలాయగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ నిర్వాకం కలకలం రేపుతుంది. పాఠశాల ఆవరణలోని సుమారు 40 ఏళ్ల నాటి 15 భారీ వృక్షాలను నరికి అమ్ముకున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాగి, మర్రి, వేప, మేడి చెట్లు నరికివేయబడినట్టు సమాచారం. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన గ్రామస్థులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని తెలిపారు.