SKLM: పొందూరు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో మంగళవారం గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. పొందూరు ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్‌తో బస్సులు, ప్రయాణికుల సామాను, ఇతర అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ మహేశ్వరి రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.