SS: మడకశిర నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మడకశిర ప్రజల తరపున ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ డివిజన్ ఏర్పాటు విషయంలో సహకరించిన మంత్రివర్గ సబ్ కమిటీకి, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్య ప్రసాద్ కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.