ELR: చింతలపూడి మండలం పంతంగలగూడెంలో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ధారావత్తు పవన్, దేశావత్ లక్ష్మీకి చెందిన 50 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. వారిరువురిపై పరారీ కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. ఈ దాడుల్లో చింతలపూడి ఎక్సైజ్ ఎస్సైలు అబ్దుల్ ఖలీల్, జగ్గారావు, సిబ్బంది పాల్గొన్నారు.