చలికాలంలో చాలామంది తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడుతారు. అయితే కొన్ని సూప్‌లతో వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. మొక్కజొన్న సూప్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని పోషకాలు వ్యాధులతో పోరాడేలా చేస్తాయి. ఏవైనా మూడు రకాల పప్పు ధాన్యాలతో చేసిన సూప్ తాగితే జలుబు, దగ్గు నుంచి రిలీఫ్ కలుగుతుంది. అలాగే అల్లం సూప్, చికెన్, మటన్ సూప్‌లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.