NLG: వచ్చే ఏడాది జిల్లాలో రహదారి ప్రమాదాలు పూర్తిగా తగ్గేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు.