NLG: టీపీసీసీ లీగల్, హ్యూమన్ రైట్స్ & ఆర్టీఐ విభాగం నల్గొండ జిల్లా కన్వీనర్‌గా న్యాయవాది అఫ్రూజ్ ఖాన్‌ను నియమించారు. ఈ మేరకు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతం, మానవ హక్కుల పరిరక్షణ, న్యాయ సమస్యలపై ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. తనపై విశ్వాసం ఉంచిన పార్టీ నాయకత్వానికి అఫ్రూజ్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.