SRPT: అనంతారంలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహించిన మెగా ఆరోగ్య శిబిరానికి టీఎస్టీడీసీ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మితమైన శ్రీదేవి–భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించి , వైద్యులను సిబ్బందిని అభినందించారు.