కృష్ణా: మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధిగా గండేపూడి నితీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు, లోకేశ్, యార్లగడ్డ వెంకట్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఈ నియామకంపై పార్టీ శ్రేణులు నితీష్‌కు అభినందనలు తెలిపారు.