నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న సినిమా ‘ప్యారడైజ్’. తాజాగా ఈ మూవీ షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 28 నుంచి మళ్లీ ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు, ఈ గ్యాప్లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరగనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ 2026 మార్చి 26న రిలీజ్ కానుంది.