యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శతవార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. 2 రోజులు జరగనున్న ఈ సమావేశాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లను సరళంగా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉంచేందుకు ఎలాంటి మార్పులు చేయాలన్న దానిపై చర్చ జరగనుంది. అభ్యర్థులకు మరింత న్యాయం అందించటం, వ్యవస్థను ఆధునికరించటం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం.