GDWL: భారత రాజ్యాంగానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో టౌన్ ప్రెసిడెంట్ కంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్యాంగం విశిష్టతను వివరించి పార్టీ శ్రేణులు విధిగా రాజ్యాంగంలోని నిబంధనలు పాటించాలన్నారు.