పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆటల సమయంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ, ప్రమాదవశాత్తు కిందపడిన 10వ తరగతి విద్యార్థి కలవేణ ప్రతీక్ తలకు గాయమై మృతి చెందాడు. వెంటనే అతడిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.