సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. రేపు ఉదయం 11:07 గంటలకు ఈ మూవీ టైటిల్‌తో పాటు ప్రీ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక GV ప్రకాష్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రాషా తడాని కథానాయికగా నటించనుంది.