AP: చిత్తూరు జిల్లాలోని టైల్స్ పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాళహస్తి మండలం ఎల్లంపాడులో జరిగింది. ఇందులో పోతురాజు, పాండు అనే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.