AKP: ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులు సిబ్బందిని జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి ఆదేశించారు. పాయకరావుపేట రైతు భరోసా కేంద్రంలో బుధవారం అధికారులు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. పెసర మినుము విత్తనాలను రైతులకు అందజేయాలన్నారు. అలాగే సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలన్నారు.