TG: రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పరిహాసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజ్యాంగంపై ఢిల్లీలో ఒకమాట.. తెలంగాణలో మరోమాట అని విమర్శించారు. రాహుల్ సేవ్ కాన్సిట్యూషన్ నినాదం రాష్ట్రంలో ఉండదా? అని ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయంతో కాంగ్రెస్ ద్వంద వైఖరి తెలిసింది అని అన్నారు. ఢిల్లీలో రాజ్యాంగ పరిరక్షణపై మాట్లాడే కాంగ్రెస్ రియల్ ఫేస్ స్పీకర్ తీర్పుతో బయటపడిందని పేర్కొన్నారు.