కోనసీమ: ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ను కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ బుధవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని కేసుల డైరీ, క్రైమ్ రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు.