సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని జమల్పూర్ గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల ట్రాక్టర్ డ్రైవర్ జగదీష్ మృతి చెందాడు. స్థానిక రైతు శ్రీనివాస్ పొలంలో పత్తి కట్టెను దున్నేందుకు వెళ్తున్న జగదీష్, ట్రాక్టర్‌తో కరెంట్ స్తంభానికి ఉన్న సపోర్ట్ వైరును తాకడంతో స్తంభం విరిగి అతనిపై పడింది. ఈ సంఘటనలో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు.