KRNL: గోనెగండ్ల గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్సై అచ్చుకట్ల షరీఫ్ (68) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు సేవలందించిన ఆయన నీతి, నిజాయితీ గల అధికారిగా గుర్తింపు పొందారు. ఆయనకు భార్య, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతిపై పలువురు పోలీసు అధికారులు, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.