KMR: తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తుండటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను కనిపెట్టేందుకు అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రైతులు, గ్రామస్థులు ఎవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.