EG: రాజమండ్రి మoజీర కన్వెన్షన్ హాల్లో ‘హై టీ’ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రేమ,శాంతిని పంచే ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషం నింపాలని కోరుకున్నారు.