అన్నమయ్య: బి.కొత్తకోటలోని ఆదర్శ పాఠశాలలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులు రామానుజన్ జీవితం, గణిత శాస్త్రానికి ఆయన చేసిన విశిష్ట సేవలపై ప్రసంగించారు. గణిత నమూనాలు, చార్టులను ప్రదర్శించారు. ఇందులో MEO రెడ్డి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.