మెక్సికో నేవీకి చెందిన విమానం టెక్సాస్లోని గాల్వేస్టోన్ కాజ్వే వద్ద కుప్పకూలింది. వైద్య కార్యకలాపాల కోసం వెళ్తున్న ఈ విమాన ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఏడాది వయసున్న చిన్నారిని వైద్యచికిత్స కోసం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో చిన్నారితోపాటు నలుగురు నేవీ అధికారులు, మరో నలుగురు పౌరులు ఉన్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.