VZM : జనసేన పార్టీ తరఫున మంగళగిరిలో నిర్వహిస్తున్న ‘పదవి బాధ్యత’ కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగుతున్న ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులు పొందిన వారికి అయన దిశానిర్దేశం చేశారు. ఆయన సూచనలు భవిష్యత్ కార్యాచరణకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.