AP: విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు అత్యధికంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2016లో 46,818 మేర ఉన్న ఈ సంఖ్య 2018 నాటికి 62,771కి పెరిగినట్లు వెల్లడించింది. అయితే కొవిడ్ కారణంగా 2020లో ఈ సంఖ్య 35,614కి తగ్గినట్లు తెలిపింది. సంఖ్య తగ్గినప్పటికీ ఇప్పటికీ AP విద్యార్థులే తొలిస్థానంలో ఉన్నట్లు పేర్కొంది.