ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ మైఖేల్ వాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి గ్రాహమ్ వాన్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న తన తండ్రి తాజాగా మరణించినట్లు వాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వార్త తెలియడంతో పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు మైఖేల్ వాన్ కుటుంబానికి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.