ADB: గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామస్తులు MLA అనిల్ జాదవ్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకారం చేసిన గ్రామ సర్పంచ్ సేడ్మాకి పద్మ, ఉప సర్పంచ్ అలీం ఖాన్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. గ్రామస్తులందరూ సమిష్టిగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు.